హిర మండలం కిట్టాలపాడు గ్రామంలో ఉన్న శిథిలావస్థ వంతెన పై నుండి భారీ వాహనాల రాకపోకలతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వంశధార ఎడమ కాలువ పై వంతెన గుండా కిట్టాలపాడు, గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి నిర్మాణ గుత్తేదారుడు భారీ టిప్పర్ వాహనాలతో రవాణా చేస్తుండటంతో ప్రమాదకరంగా ఉన్న వంతెన గుండా భారీ వాహనాలు నడపడకుండ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.