మెలియాపుట్టి: ఇళయపురం సర్పంచ్ ను తొలగించాలని ఆందోళన

84చూసినవారు
మెలియాపుట్టి మండలంలోని ఇళయపురం గ్రామ సర్పంచ్ గౌరీష్ అవినీతి అక్రమాలపై స్థానిక పంచాయతీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సభ్యులు మాట్లాడుతూ.. పంచాయతీ నిధులతో పాటు అక్రమంగా పలువురి వద్ద నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ డబ్బులు వసూలు చేసాడని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్