పాతపట్నం నియోజకవర్గం లోని సీది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నజరానా ప్రకటించారు. సోమవారం జరిగిన ముగ్గుల పోటీలలో భాగంగా 85 మంది మహిళ పోటీదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పాఠశాలను సందర్శించి ముగ్గులను పరిశీలించారు. పోటీలో విజేతులగా నిలిచిన వారికి 30 వేల రూపాయలు బహుమతిని ఆయన స్వయంగా ప్రకటించారు.