ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

77చూసినవారు
ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
శ్రీకాకుళం జిల్లా హీరమండలం కిట్టాలపాడులో శుక్రవారం అర్థరాత్రి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో దొంగతనం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. వంశాధార ఎడమ కాలువ వంతెన ఎదురుగా ఉన్న ఆలయం తాళాలు పగలగొట్టి హుండీని దొంగిలించారు. హుండీలో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లి హుండీని పొదల్లో పడేసారని స్థానికులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్