జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఎస్వి సత్యప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన పంద్రాగస్టు కార్యక్రమంలో వీరికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అంకిత భావంతో విధి నిర్వహణ, అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.