గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం, ప్రాజెక్టులను తొలగించడం వంటి పనులు కూటమి ప్రభుత్వం చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన టెక్కలి మండలం మూలపేటలో పనుల పరిశీలన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పోర్టు పనులకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. 2025 జూన్ 12వ తేదీలోగా పోర్టు పనులు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.