వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతున్నదని వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ అన్నారు. ఆదివారం నందిగాం మండలం నరేంద్రపురం పంచాయతీలోని పాతినవానిపేట గ్రామంలో సిసి రోడ్డు, కాలువ నిర్మాణానికి ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తితో కలిసి శంకుస్థాపన చేశారు. తిలక్ మాట్లాడుతూ దేశ చరిత్రలో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమపథకాలు అందజేసి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు.