టెక్కలి మండలం గూడెం పంచాయతీ పరిధి సన్యాసి నీలాపురం గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. చిన్నారులు నిత్యం ఈ శిథిలావస్థ గదిల చుట్టూ ఆడుకుంటూ ఉంటారు. ఏ సమయంలోనైనా శిథిలావస్థ తరగతి గది గోడలు కూలితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తరగతి గదిని మరమ్మతులు చేయాలని స్థానికులు, తల్లిదండ్రులు గురువారం కోరారు.