టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో బుధవారం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సమక్షంలో మండల వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలాగే ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ను, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ను గెలిపించుకోవడమే ద్యేయంగా పనిచేస్తామని నినాదాలు చేశారు.