ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో మెట్టెక్కి వలసలో గ్రామస్తులతో శనివారం సమావేశం నిర్వహించినట్లు ఎస్ఐ కె. వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి, నిషేధిత మత్తు దుర్వినియోగం, అక్రమ రవాణా, సైబర్ మోసాలు, మహిళా భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోబడతారని స్పష్టం చేశారు.