భద్రాద్రి కొత్తగూడెం ఎస్పి ఆర్ధిక సహాయం

475చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పి ఆర్ధిక సహాయం
విజయనగరం జిల్లా రెగుడి ఆముదాలవలస మండలం వావిలవలస గ్రామానికి చెందిన రాహూల్ సౌరబ్ నిత్య అన్నదానం సత్రంకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పి వినీత్ కుమార్ లక్ష యాభై వేల రూపాయలు భారీ ఆర్ధిక సహాయం చేశారు. వివరాలలోకి వెళితే.. ఆదివారం నాడు మీడియాతో సత్రం నిర్వాహకులు పాలూరి సిద్దార్థ మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా సత్రంలో ఉన్నటువంటి సుమారు 30 మంది అనాధలు, వికలాంగులకు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం చూడడానికి అవకాశం కల్పించారని తెలిపారు. మాకు ఇరువైపులా బస్ సౌకర్యం, భోజనాలు సదుపాయం కల్పించారని అన్నారు. వారికీ మేమందరం రుణపడి ఉంటామని అన్నారు. దైవం మానుష రూపేణ అన్న పదానికి ఉదాహరణ ఎస్పి వినీత్ కుమార్ అని తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్