శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి అభిషేకాలు అనంతరం వైకుంఠ ద్వార దర్శనం జరిగాయి. శుక్రవారం ఆముదాలవలసలో ఉన్న లక్ష్మినారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులు ఏడుసార్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా భక్తులు లక్ష్మీనారాయణ స్వామి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణం నిర్వహించారు.