క్రీడలతోనే యువతకు బంగారుభవిష్యత్తు ఉంటుందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆముదాలవలస జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆరు ఓవర్ల క్రికెట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ యువతకు చదువుతోపాటు క్రీడలు అవసరమని అందులో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత క్రీడ వైపు ఆసక్తి చూపాలని సూచించారు.