పరిశ్రమల నుండి వస్తున్న కాలుష్యం వలన జన జీవనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గోంటి గిరిధర్ అన్నారు. ఆదివారం ఉదయం ఎచ్చెర్ల మండలం అరినం అక్కివలస, పట్టు శాలిపేట తదితర గ్రామాలలో బృంద సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కాలుష్యం వలన రోగాల బారిన ప్రజలు పడుతున్నారని వీటిని నియంత్రించాలని సూచించారు. దీని పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.