విజయవాడలో జరుగుతున్న పాలిటెక్నిక్ సైన్స్, టెక్నాలజీ ప్రదర్శనలో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ ఎచ్చెర్ల విద్యార్థులు జిల్లా వారీగా 4వ స్థానం, రాష్ట్రస్థాయి ప్రదర్శనలో కూడా ఎంపికయ్యారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఫైటింగ్ రోబోలు సహాయంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఏవిధంగా కాపాడాలి అనే పరికరాన్ని సంబంధించి వివరణ ఇచ్చామని విద్యార్థులు తెలిపారు.