గార: ‘ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి'
గార మండలం బందరువానిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఉదయం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ తిరుమల చైతన్య ప్రార్థన సమయానికి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థుల సామర్ధ్యాలు పెంచే విధంగా బోధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.