పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గార మండలం అంపోలు గ్రామానికి చెందిన కోరుపోలు రమణ అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన రమణకి తరచుగా వళ్లు నొప్పులు ఉండేవి. ఈ తరుణంలోనే శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చిన రమణ.. తన భార్య సంతోషికి ఈ విషయం చెప్పాడు. వెంటనే ఆమె అతడిని శ్రీకాకుళం రిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.