కంచిలి మండలం మకరాంపురం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్సకు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.