సోంపేట మండలంలోని బారువ గ్రామానికి చెందిన కర్రి రాము అనే వ్యక్తి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు ఎలుక మందు తిని అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు శనివారం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వైద్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ కి తరలించినట్లు భార్య నీలవేణి తెలిపారు.