జలుమూరు మండలములోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో జిల్లా నలుమూలల నుండి మాత్రమే కాకుండా ఒడిస్సా రాష్ట్రం నుండి కూడా భక్తులు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి సోమవారం రద్దీగా ఉండే అవకాశం ఉందని ఈ క్రమంలోనే సెలవు దినము నేడు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరావడం జరిగిందని భక్తులు తెలియజేశారు.