Nov 03, 2024, 02:11 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు
Nov 03, 2024, 02:11 IST
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి చౌరస్తా వద్ద సోమవారం రాత్రి రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మనిష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. 108 సిబ్బంది యువకుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుని పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ కు తరలించినట్టు తెలిసింది.