TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ముగిసింది. రైతు భరోసా విధివిధానాలపై దాదాపు 2 గంటల పాటు భేటీ సాగింది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై కమిటీ ఇంకా పూర్తిగా నిర్ణయానికి రాలేదు. ట్యాక్స్ పేయర్లను, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించాలని చర్చించారు. మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది.