TG: రుణమాఫీ చేయాలని ఒంటి కాలిపై రైతులు నిరసన చేపడుతున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో వెంటనే రుణమాఫీ చేసి, రైతుబంధు ఇవ్వాలని ఒంటి కాలిపై నిలబడి రైతులు నిరసన చేశారు. రుణమాఫీ విషయమై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా కూడా ఏమాత్రం లాభం లేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు.