మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను యమునా నదిలో నిమజ్జనం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్ నుంచి ఆదివారం ఉదయం అస్థికలను సేకరించారు. అనంతరం యమనా నది సమీపంలోని ‘మజ్ను కా తిలా’ గురుద్వారా సమీపంలో కుటుంబ సభ్యులు సిక్కు సంప్రదాయం ప్రకారం ఆయన అస్థికలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్, ఆయన కుమార్తెలతో పాటు బంధువులు పాల్గొన్నారు.