యూపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఝాన్సీకి చెందిన కుల్దీప్ యాదవ్ అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ క్లాస్ రూమ్‌లో పోర్న్ వీడియోలు చూస్తుండగా.. ఓవిద్యార్థిఓ విద్యార్థి గుర్తించాడు. ఈ విషయం కాస్తా తోటి విద్యార్థులతో చెప్పగా.. విద్యార్థులు అతడిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన టీచర్ గుర్తించిన బాలుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి గాయాలయ్యాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.