పలాస: అక్కాచెల్లెళ్లపై అత్యాచార ఘటనను ఖండించిన ఎమ్మెల్యే

2929చూసినవారు
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లతో పాటు మరో బాలిక, ముగ్గురు యువకులు శనివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు అంటూ జగనన్న కాలనీకి వెళ్లారు. మద్యం మత్తులో ఉండగా అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడగా ఈ ఘటనను మరో యువకుడు ఫోన్లో చిత్రీకరించాడు. కాగా సోమవారం బాలికల తల్లి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్