అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఆర్టీవో శ్రీనివాసరావుకు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి వినతిపత్రం అందజేశారు. మందస మండలం హరిపురంలో ఉన్న కైజన్ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేవని, అర్హత లేని సిబ్బందిని బోదనకు నియమించుకున్నారని వారు ఫిర్యాదు చేశారు.