పాతపట్నం: అంగన్వాడి వ్యవస్థను మరింత బలోపేతం చేయండి

56చూసినవారు
అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం ఎల్ ఎన్ పేట మండలంలోని చింతల బడవంజ గ్రామంలో అంగన్వాడి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు ఈ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని దీనిని ఆయా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్