హిరమండలం: గిరిజన గ్రామాలలో రోడ్లు పనులు పూర్తి చేయాలి

73చూసినవారు
హిరమండలం: గిరిజన గ్రామాలలో రోడ్లు పనులు పూర్తి చేయాలి
హిరమండలంలోని పెద్దగూడ ఆదివాసీ గిరిజన పంచాయితీ పాండ్రమానుగూడ, బలదగూడ గ్రామాల్లో రోడ్లు పనులు పూర్తి చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అప్పన్న, స్థానికులు డిమాండ్ చేశారు. ఆదివారం తమ గ్రామంలో సమావేశం నిర్వహించి అనంతరం నిరసన చేపట్టారు. పలుమార్లు సమస్యను ప్రజాప్రతినిధులు, ఐ టి డి ఏ అధికారులకు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోలేదని వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్