సైలాడ పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులు పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. శుక్రవారం ఆముదాలవలస మండలంలోని సైలాడ పంచాయతీలో కుమ్మరిపేట దివంజిపేట సైలాడ గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో వేతనదారులకు పనులకు వెళ్ళకుండా బిల్లులు చేస్తున్నారన్న ఆరోపణలపై ఏపీడి కే లోకేష్ విచారణ చేపట్టారు. ఈ విషయమే ఏపీడిని అడుగ్గా నిర్వహించామని వారిచ్చిన నివేదిక మేరకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.