మురికి కూపంగా ఎల్ఎన్ పేట రహదారి

70చూసినవారు
మురికి కూపంగా ఎల్ఎన్ పేట రహదారి
లక్ష్మీనర్సుపేట గ్రామానికి ఉన్న ఆర్ అండ్ బి రహదారి మురికి కూపంగా తయారైంది. లక్ష్మీనర్సుపేట జంక్షన్ నుండి గ్రామం ‌గుండా తురకపేట జంక్షన్ వరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. గ్రామంలో బస్టాండ్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు రహదారి అధ్వాన్నంగా తయారైందన్నారు. ఏ మాత్రం వర్షం కురిసిన గుంతల్లో చేరిన నీటి నిల్వలు వాహనాలు రాకపోకలు బురదగా తయారై దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్