శ్రీ విజయ గణపతి కి విశేష పూజలు

58చూసినవారు
శ్రీ విజయ గణపతి కి విశేష పూజలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరములో కొలువై ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయములో ప్రాత కాలంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. దేవాలయ అర్చకులు స్వామివారిని పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి అధికముగా భక్తులు విచ్చేశారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్