టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి శ్రీనివాస్ నగర్‌కు చెందిన ఎస్. భాస్కర్ (35) గురువారం కిడ్నీ వ్యాధితో మృతిచెందాడు. కొంతకాలంగా డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న అతని ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో కుటుంబసభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందేలోపే ప్రాణాలు కోల్పోయాడు. భాస్కర్ మరణంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా, స్థానికులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.