టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో సోమవారం రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. గ్రామంలోని సర్వే నంబర్ 89/20లో కాలువపై చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న క్రమంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. కాగా ఈ మేరకు తాజాగా సోమవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు పర్యవేక్షణలో ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపట్టారు.