104 సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేయాలని సిబ్బంది కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చేన్నాయుడును కోటబొమ్మాలి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించడంతోపాటు ప్రభుత్వమే ఈ సర్వీస్ లను నడిపే విధంగా చూడాలంటూ వారు కోరారు.