కోటబొమ్మాళి మండలం బొడ్డపాడు గ్రామం సమీప జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో లారీ బోల్తా పడకుండా బ్యాలెన్స్ గా ఆగింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.