నిమ్మాడ: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం: మంత్రి అచ్చెన్నాయుడు

67చూసినవారు
నిమ్మాడ: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం: మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. పలు సమస్యలు, ఉపాధి అవకాశాల కోసం పలువురు వినతులు ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్