సంతబొమ్మాలి మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన మర్ల సవరయ్య హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లారు. ఆరోగ్య సమస్య వల్ల పని చేయలేని పరిస్థితిలో ఉన్న ఆయనకు పోషణ కష్టం ఎదురైంది. దీంతో గ్రామానికి చెందిన రెయ్యి వసంత రెడ్డి కుటుంబం 11,000 రూపాయల ఆర్థిక సహాయం బుధవారం అందించారు.