కోటబొమ్మాళి సమీపంలో అస్థిపంజరం కలకలం

8317చూసినవారు
కోటబొమ్మాళి సమీపంలో అస్థిపంజరం కలకలం
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం విశ్వనాధపురం గ్రామంలోని ఓ కొండ సమీపంలో గురువారం గుర్తుతెలియని అస్థిపంజరం గ్రామస్థుల కంటపడింది. దీంతో గ్రామస్థులు స్థానిక వీఆర్వో పైల దాలప్పకు సమాచారం ఇవ్వటంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్