టెక్కలి: దళిత స్మశానవాటికకు దారేది

73చూసినవారు
టెక్కలి: దళిత స్మశానవాటికకు దారేది
దళితుల స్మశాన వాటికలకు రహదారి కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి డిమాండ్ చేశారు. ఈ మేరకు టెక్కలిలో గురువారం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టెక్కలి మండలం రక్షణ పేట హాలియా సాగరం రాధా వల్లపురం లింగాలవలస తులసిపేట టీ. లింగాలపాడు, నీలాపురం గ్రామాల్లో దళిత స్మశానవాటికకు దారి లేదన్నారు. అనంతరం సమస్యలు పరిష్కారం చేస్తానని ఆర్డిఓ హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్