నందిగాం మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన కోనారి జయలక్ష్మి (24) సోమవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాముకాటుతో అస్వస్థతకు గురైంది. దీంతో గుర్తించిన భర్త సోమేశ్వరరావు హూటాహుటిన టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.