రాష్ట్రానికి హోదా లేదు.. రాజధాని లేదు: షర్మిల

81చూసినవారు
రాష్ట్రానికి హోదా లేదు.. రాజధాని లేదు: షర్మిల
కడపలో ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే .. హామీలన్నీ గాలికి కొట్టుకుపోతాయన్నారు. ఆంజాద్, మల్లికార్జున్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అందరూ దోపిడీదారులన్నారు. కడపలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని లేదన్నారు. చట్టసభలకు నిందితులు రావొద్దనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని షర్మిల అన్నారు.

సంబంధిత పోస్ట్