హైదరాబాద్‌లో డిసెంబరు 8 నుంచి అగ్నివీర్‌ సైనిక నియామక ర్యాలీ

62చూసినవారు
హైదరాబాద్‌లో డిసెంబరు 8 నుంచి అగ్నివీర్‌ సైనిక నియామక ర్యాలీ
TG: సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువకులను భారతీయ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు సైన్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు 8 నుంచి 16 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు పోటీలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని ఆర్మీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్