పేదలకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్లులేనివారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన-2.0లో భాగంగా కొత్త ఏడాదిలో గృహ యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అర్హులను గుర్తించే సర్వే ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టింది. ఈనెలాఖరు నాటికి డిమాండ్ సర్వే పూర్తి చేసి కొత్త సంవత్సరంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. ఖాళీ స్థలం ఉన్నవారికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చి రుణాలు మంజూరు చేయనున్నట్లు సమాచారం.