పిన్నెల్లిపై పుస్తకం విడుద‌ల చేసిన టీడీపీ

69చూసినవారు
పిన్నెల్లిపై పుస్తకం విడుద‌ల చేసిన టీడీపీ
AP: మాచ‌ర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై ‘పిన్నెల్లి పైశాచికత్వం’ పేరుతో టీడీపీ పుస్త‌కాన్ని రూపొందించింది. మంగళగిరిలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో టీడీపీ నేత‌లు ఈ పుస్త‌కాన్ని విడుద‌ల చేశారు. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలను గురించి ఈ పుస్త‌కంలో వివ‌రించిన‌ట్లు నేత‌లు తెలిపారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాల్లేకుండా పోతే.. వైసీపీ హయాంలో ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్