ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నాని

56చూసినవారు
ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నాని
చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై బీజేపీకి నమ్మకం లేదని, అందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదని వైసీపీ నేత కేశినేని నాని ఆరోపించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో.. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో అని అన్నారు. అందుకే మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడటం లేదన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం కావడం ఖాయమని కేశినేని నాని అన్నారు.

సంబంధిత పోస్ట్