అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక యువకుడి మృతదేహాన్ని..

79చూసినవారు
అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక యువకుడి మృతదేహాన్ని..
ఉత్తరాఖండ్‌ హల్ద్వానీ జిల్లాలో హృదయ విదారకమైన సంఘటన జరిగింది. హల్దుచౌడ్‌లోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అభిషేక్ (20) శనివారం విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు పట్టాల వద్ద అతడి మృతదేహన్ని గుర్తించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.10 వేలకుపైగా డిమాండ్‌ చేశారు. దీంతో ఒక వాహనం టాప్‌పై యువకుడి మృతదేహాన్ని కట్టేసి గ్రామానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్