సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్విహాస్టళ్లలో చదివే బాలికలపై వేధింపులు, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలను సమర్ధంగా అడ్డుకునేలా సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని ఏపీ ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఓ కేసు తీర్పు సమయంలో స్పష్టం చేసింది. హస్టళ్లలో చదివే బాలికల భద్రత పూర్తిగా అక్కడ టీచర్లు, ప్రిన్సిపాళ్లదే అని స్పష్టం చేసింది. ప్రహరీలు, వాటికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుినుల రాకపోకలను పర్యవేక్షించాలని సూచనలు చేసింది.