ఏపీలో ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

83చూసినవారు
ఏపీలో ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
వేసవికాలం రాకముందే ఏపీలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కర్నూలు, సత్యసాయి, నంద్యాల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొద్దుటూరు, అనకాపల్లి, రాజానగరం, కపిలేశ్వరంలో 35.8 డిగ్రీలు నమోదైంది. మన్యం జిల్లా జియ్యమ్మవలస, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 35.7 డిగ్రీలు, ఏలూరు, కాకినాడలో 35.6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్