సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాం. కొన్ని సందర్భాల్లో వింత జననాలు కూడా చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ఓ గేదె.. ఆవుదూడ లాంటి బిడ్డకు జన్మనిచ్చింది. నల్లగా ఉండే గేదె.. ఆవులా కనిపించే గోధుమ రంగు దూడకు జన్మనివ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ అసాధారణ దృశ్యాన్ని చూసేందుకు యజమాని ఇంటికి తరలి వస్తున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.